ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరోనా పై అవగాహన కార్యక్రమం

0
90

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక టవర్ సెంటర్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా కరోనా పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్ సడలింపు తర్వాత కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోవడంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని శానిటైజర్ వాడాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు అదేవిధంగా పట్టణంలో మాస్కులు లేకుండా తిరిగే వారికి మాస్క్ లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కార్తీక్ చిన్న శ్యామ్ హర్షవర్ధన్ జార్జ్ మైకేల్ వెంకటేష్ హర్ష సూర్య తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY