గూడూరు పట్టణంలో ఆదరణ పథకం-2

0
115

Times of Nellore (GUDUR)# కోట సునీల్ కుమార్‌# : గూడూరు పట్టణంలోని కమిటీ హాల్ నందు ఆదరణ పథకం-2 లో భాగంగా గూడూరు , వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని కుల వృత్తుల లబ్ధిదారులకు పరికరాలను అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 లోనే కుల వృత్తుల వారికి సబ్సిడీలతో పరికరాలను అందజేయడం ప్రారంభించిందన్నారు . గూడూరు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కుల వృత్తుల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు . మున్సిపల్ చైర్ పర్సన్ దేవసేన మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను కుల వృత్తుల వారికి అందజేయడం జరుగుతుందన్నారు . వీటి ద్వారా వారి కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకుని అభివృద్ధి సాధించాలని అన్నారు . కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారిని రాజేశ్వరి , గూడూరు ఎంపీపీ రావమ్మా, వైస్ ఎంపీపీ శ్రావణి , ఎంపీడీవో అన్నపూర్ణ రావు , కౌన్సిలర్లు , టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు .

SHARE

LEAVE A REPLY