డా. వైఎస్ఆర్ కు ఘననివాళి

0
209

Times of Nellore (Nellore\Rural) – డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 69 వ జయంతి సందర్భంగా నెల్లూరు కరెంటు ఆఫీస్ సెంటర్ లో వై ఎస్ ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఒక ముఖ్యమంత్రి ప్రజలకోసం ఏవిధంగా పనిచేయవచ్చో చూపించిన మహానేత డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్సులు ఆనం విజయకుమార్ రెడ్డి,పెర్నేటి శ్యాంకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY