ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు.

0
128

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ #  – నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి దివ్యాంగులకు మోటారు ట్రైసైకిళ్లు, సీబీఎన్ కప్ క్రికెట్ టోర్నీవిజేతలకుబహుమతులను తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందచేసారు. సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూ …హిందూపురం ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన బాలకృష్ణకు అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. అధికారంలోఉన్నప్పుడు అనేక ఆంక్షలుంటాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు పూర్తి అండగా ఉన్నామనే తృప్తి ఉంటుందన్నారు.జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో సమస్య వచ్చినా వెళ్లి అండగా నిలబడవచ్చునన్నారు.

వైకాపాకు అంచనాలకు మించి సీట్లు,మెజార్టీలువచ్చాయన్నారు.జిల్లాలో ఇద్దరు యువకులు మంత్రిపదవులు పొందడంతో పాటు కీలకశాఖల బాధ్యతలు చేపట్టడంఅభినందనీయమన్నారు.జిల్లా ప్రజలు, రైతుల కోసం నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటుప్రజానీకానికిఅవసరమైనవన్నిచేయాలనికోరుకుంటున్నా.మన్నారు.టీడీపీ అధికారం చేపట్టినప్పుడు అంతకుముందు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపలేదని ఎవరికీ అన్యాయం చేసేప్రయత్నంచేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసంఎంతోకష్టపడ్డా.డానిఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఎక్కడ ఇష్టపడలేదో, ఏమి కావాలని కోరుకున్నారో నిర్మాణాత్మకంగా విశ్లేషించుకుంటామన్నారు.ఈవీఎం వ్యవస్థపై సుబ్రహ్మణ్యం స్వామి వంటి పెద్దలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొన్ని లక్ష్మయ్య నాయుడు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గ్రంధాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు బాలకృష్ణ అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY