ఘనంగా ఎల్లసిరి గోపాల్ రెడ్డి 71వ పుట్టినరోజు వేడుకలు

0
184

Times of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రెండో పట్టణ పరిధిలోని వైసిపి కేంద్ర కమిటీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి 71వ పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎల్లసిరి గోపాల్ రెడ్డి భారీ కేకును కట్చేసి వైసీపీ శ్రేణులకు అందజేశారు. డివిజన్ పరిధిలోని వైసిపి నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మేరిగ మురళీధర్ మాట్లాడుతూ. గోపాల్ రెడ్డి ఇలాంటి వేడుకలు జరుపుకునేందుకు ఇష్టపడరని తెలిపారు అయితే పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు ఈ చిన్నపాటి వేడుకలు నిర్వహించేందుకు ఒప్పుకున్నారన్నారు . వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, సాయిబాబా మందిరం నందు మాజీ గూడూరు చైర్పర్సన్ మంజుల చేతులమీదుగా పేదలకు దుప్పట్ల పంపిణీ, క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేశారు. కార్యక్రమాల్లో వైసిపి రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి, వైసిపి నాయకులు నాసిన నాగులు, గిరిబాబు, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మెట్ట రాధాకృష్ణారెడ్డి, విజయ్ కుమార్, దసరదరామిరెడ్డి, పెంచల్ రెడ్డి, ఉదయ్కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, తాళ్లూరు శ్రీనివాసులు చింతల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY