నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం…. నలుగురు మృతి !!

0
188

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని తడ మండలం పన్నగాడు రాష్ట్ర సరిహద్దు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదం లో కారు లో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం జరిగింది. మృతులంతా ఒంగోలు వాసులుగా  గుర్తించారు. తడ మండలం లోని రాష్ట్ర సరిహద్దు పన్నగాడు వద్ద చెన్నై నుండి వస్తున్న కారు ఆగి ఉన్న కారును డీ కొట్టడం తో ఘోర ప్రమాదం జరిగింది. కారు లో ప్రయాణిస్తున్న ఒంగోలు లాయర్ పేట కు చెందిన నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం జరిగింది .మృతుల్లో ఏడాది బాబు రియాన్స్ సెల్వి తో పాటు విజయ లక్ష్మి , రితిక .అనుసెల్వి , ఉన్నారు తీవ్రంగా గాయపడిన నమిత ,యస్వంతులను తమిళనాడు లోని గుమ్మిడిపూండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరి పరిస్థితికూడా విషమంగా ఉంది వీళ్ళు కారులో చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి ఒంగోలుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

SHARE

LEAVE A REPLY