పొదలకూరులో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు

0
1744

Times Of Nellore ( Podalakur ) – పట్టణం లోని చెరువు గట్ల వెంబడి ముళ్ల పొదల వద్ద గంజాయ్ వినియోగం విచ్చలవిడిగా సాగుతుంది. కొందరు యువకులు గంజాయ్ మత్తులో ఉగుతున్నారు. గతంలో పొదలకూరు పోలీసులు విగ్నేశ్వరపురం కాలనిలో గంజాయ్ అమ్మకం దారులను అదుపులోకి తీసుకొన్నారు. ప్రొహిబిషన్ శాఖ పరిధిలో వచ్చే గంజాయ్ వినియోగంపై ఆ శాఖ అదికారులు నిఘా పెట్టిన దాఖలు లేవు దీంతో యువత పెడత్రోవ పడుతున్నట్లు తెలుస్తుంది. పగటి వేళల్లో గంజాయ్ దమ్ము బిగించి మత్తులోకి వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చాల ఏళ్లుగా గంజాయ్ అమ్మకాలు సాగుతున్నాయి. దీనిపై పోలీసులు నిఘా పెట్టాల్సి ఉంది. పోలేరమ్మ దేవస్థానం,చెరువు గట్టు, స్మశాన స్థలం, తదితర ప్రాంతాల్లో గంజాయ్ దమ్ము కొట్టే వారు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

SHARE

LEAVE A REPLY