ప్రజా సమస్యల పరిష్కార వేదికగా గాంధీనగర్ వైఎస్సార్‌ సీపీ కార్యాలయం

0
205

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, గాంధీనగర్ లో నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జాకీర్ తో కలసి 50 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. గాంధీనగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గాంధీనగర్ లో వైఎస్సార్‌ సీపీ కార్యాలయం ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా మారాలని అన్నారు. రానున్న ఎన్నికలలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతీ కార్యకర్త రుణం తీర్చుకుంటానని అన్నారు. కార్యకర్తల కష్టం నాకంటే బాగా ఎవరికీ తెలియదని, కార్యకర్తగా జీవితం ప్రారంభించి రూరల్ ప్రజల ఆశీస్సులతో, జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం తరువాత మొట్టమొదటి కార్యాలయం గాంధీనగర్ కార్యాలయం అని అన్నారు. 30 డివిజన్ గాంధీనగర్ లో ప్రారంభించిన కార్యాలయం నగరంలోని అన్ని ప్రాంతాలకు ఆదర్శం కావాలని అన్నారు. 30వ డివిజన్ లోని ప్రజలకు ఏ సమస్య వచ్చిన గాంధీనగర్ లో వైఎస్సార్‌ సీపీ కార్యాలయం ఉంది అక్కడి వెళ్తే మనకు సమాదానం చెబుతారు, మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేలా గాంధీనగర్ వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వేదిక కావాలని పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY