ఉదర కోశ వ్యాధులకు సంబంధించిన ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్.. !!

0
55

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒కరోనా సమయంలో కోవిడ్ పేషంట్లకు, నాన్ కోవిడ్ పేషంట్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా మెడికవర్ ఆస్పత్రి సమర్ధవంతంగా చికిత్సలు అందించిందని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉదర కోశ వ్యాధులకు సంబంధించిన ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 20 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు ఈ క్యాంప్ ఆస్పత్రిలోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ క్యాంప్ జరుగుతుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను యాజమాన్యం మీడియా సమావేశంలో విడుదల చేసింది.

SHARE

LEAVE A REPLY