నారాయణలో మొదటిసారిగా పురిటి బిడ్డకు అరుదైన చికిత్స

0
261

Times of Nellore ( Nellore ) – నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ లో మొదటిసారిగా పురిటి బిడ్డకు అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పుట్టిన పాపకు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో డా. ఆర్. గోకుల్ కృష్ణన్ ఆ పాపను పురిటి పిల్లల అత్యవసర చికిత్సా విభాగంలో అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా పాపకు “కాంజినైటల్ న్యూమోనియా” మరియు “పల్మనరి హైపోప్లేసియూ” గా నిర్థారించారు. ఇలాంటి సమస్య ఊపరితిత్తులు పూర్తిగా ఎదుగుదల లేనందువలన వస్తుందని, ఇలాంటి స్థితిలో ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బిందిగా ఉంటుందని, ఊపిరితిత్తులు సరిగా ఎదగకపోవడం వలన కావలసినంత శ్వాస అందక ఇబ్బంది పడతారని ఈ ప్రక్రియను అల్ వెమాలి అని అంటారని పేర్కొన్నారు. పాపకు కన్వెన్షనల్ వెంటిలేటర్ ద్వారా కృతిమ శ్వాస అందించడానికి ప్రయత్నించగా అది అంతగా సఫలీకృతం కాలేదని, డా. ఆర్. గోకుల్ కృష్ణన్ తెలిపారు.

ఇలాంటి పరిస్థితిలో హైఫ్రీక్వెన్సీ ఆసిలేటరి వెంటిలేటర్ ద్వారా ఆ బిడ్డకు తగినంత శ్వాస అందించడమే కాకుండా ఊపిరితిత్తుల ఎదుగుదలకు వైద్యం అందించడం జరిగిందని అన్నారు. క్రమేణ బిడ్డ ఆరోగ్యం కుదుటపడి క్రమంగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తనే స్వతహాగా శ్వాస తీసుకుంటూ తల్లిపాలు త్రాగుతూ ఉందని, మొదటిసారిగా ఇలాంటి అరుదైన పరికరాన్ని ఉపయోగించి చాల క్లిష్టమైన చికిత్సను అందించి బిడ్డ ప్రాణాలు రక్షించడం జరిగిందని డా. ఆర్. గోకుల్ కృష్ణన్ తెలిపారు.

ఈ సందర్భంగా సీఈవో డా. ఎస్. సతీష్ మాట్లాడుతూ.. చాలా ఖరీదైన ఇలాంటి వైద్యం నారాయణ మాతృసేవా పథకం ద్వారా అందించడం జరిగిందని, ఇలాంటి క్లిష్టమైన, అరుదైన చికిత్సలు, శస్త్రచికిత్సలు సామాన్యుడికి అందుబాటలో ఉంటాలని, నారాయణ హాస్పిటల్ ఎన్నోరకాల, ఎంతో విలువైన పథకాలను అమలుపరిస్తూ అందరికి ఆరోగ్యం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఏజీఎం సి.హెచ్ భాస్కర్ రెడ్డి, మార్కెటింగ్ సహెడ్ కె. సత్యనారాయణ, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ డా. దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY