సీఎం జగన్ పై అబ్దుల్ అజీజ్ ఫైర్ !!

0
46

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే  కనీస మర్యాద లేదని మాజీ మేయర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో అయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ళ పట్టాలు మళ్ళీ ఇస్తానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు . ఉగాది కి ఇస్తానని చెప్పి ప్రకటన చేసి మాట తప్పారు అని అన్నారు.ర్వాత అంబేద్కర్ జయంతి కి ఇస్తానని చెప్పి మళ్ళీ మోసం చేశారరన్నారు. వైఎస్సార్ గారి జయంతి కి ఇస్తానని చెప్పి, మళ్ళీ మాట తప్పారు అని అన్నారు. తర్వాత గాంధీ జయంతి కి ఇస్తానని చెప్పి మళ్ళీ మాట తప్పారు.మళ్ళీ ఆగస్ట్ 15 కి ఇస్తానని మళ్ళీ మాట తప్పారన్నారు. ఏది ఏమైనప్పటికి క్రిస్మస్ రోజు, ప్రపంచ శాంతి దినం నాడు అయినా, ఇస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్అని అన్నారు . డిసెంబర్ 25 నాడు స్థలాలే కాకుండా అర్బన్ హౌస్ లు కూడా ఎవరివి వారికి ఇచ్చేసి, అందరి చేత గృహ ప్రవేశాలు చేయించాలని డిమాండ్ చేశారు

SHARE

LEAVE A REPLY