ఆల్తూరు గిరీష్ రెడ్డి కి సన్మానం

0
155

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఎన్నికైన, నెల్లూరు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్స్వామి దేవలయం మాజీ చైర్మన్ ఆల్తూరు గిరీష్ రెడ్డి కి మూలస్థానేశ్వర స్స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. పలువురు ప్రముఖులు, భక్త బృందం సభ్యులు గిరీష్ రెడ్డి కి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ఆల్తూరు గిరీష్ రెడ్డి మూల స్థానేశ్వర స్వామి చైర్మన్ గా విశేష సేవలందించారన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న భగవంతుని ప్రార్ధించే ప్రతి ఒక్కరికి గిరీష్ రెడ్డి సుపరిచితులన్నారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎన్నికవడం సంతోషదాయకమన్నారు. భవిష్యత్తు లో గిరీష్ రెడ్డి కి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి భగవవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నామన్నారు.తనకు సన్మానం ఏర్పాటుచేసి సత్కరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని గిరీష్ రెడ్డి అన్నారు.

SHARE

LEAVE A REPLY