మూర్చ వ్యాధి ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు – డాక్టర్ బిందు మీనన్

0
159

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – నెల్లూరులోని అపోలో స్పెషాలటీ హాస్పిటల్ లో సోమవారం ప్రపంచ మూర్చ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హాస్పిటల్ న్యూరాలజీ విభాాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిందు మీనన్ తో పాటూ సిబ్బంది గాల్లోకి ఓ పెద్ద హెలియం బెలూన్ ఎగుర వేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన అవగాహన సదస్సులో డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి రెండవ సోమవారం అంతర్జాతీయ మూర్చ వ్యాధి అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మూర్చ వ్యాధి మొదడుకు సంభందించిన వ్యాధి అని, ఈ వ్యాధి విద్య, ఉద్యోగంతో పాటూ వివాహంపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె వివరించారు. మూర్చ వ్యాధి అన్నీ వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉందని, మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్ బిందు మీనన్ పేర్కొన్నారు.కొంతమందిలో జన్యు పరంగా, కుటుంబ చరిత్ర, ఆ కుటుంబంలో ఉన్న వారి లక్షణాల ఆధారంగా మూర్చ వ్యాధి సోకే అవకాశం ఉందని, వ్యాధి సంభవించినప్పుడు రోగికి వీలైనంత ప్రశాంత వాతావరణం కల్పించి, వైద్యం అందించాలని ఆమె వెల్లడించారు. సరైన సమయంలో వైద్యం తీసుకుంటే మూర్చ వ్యాధి తగ్గుతుందని ఆమె తెలియజేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మూర్చ వ్యాధికి అత్యాధునిక చికిత్సలు, నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బిందు మీనన్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ నవీన్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY