అనాధలకు మనం అండగా నిలిస్తే, భగవంతుడు మనకు అండగా నిలుస్తాడు – ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
190

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని 18వ డివిజన్ లోని కొండాయపాళెం హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగ్ లు, ప్లేట్లు, గ్లాసులను లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. పేదలకు, అనాధలకు మనం అండగా నిలబడితే, భగవంతుడు మనకు, మన కుటుంబాలకు అండగా ఉంటాడని, మానవసేవే మాధవ సేవని అన్నారు. జన్మదినాలు, వివాహాలు, వివాహ వార్షికోత్సవాలు, గృహ ప్రవేశాలు, పెద్దల సంస్మరణ దినాలు ఎంతో ఆడంబరంగా ఎవరి శక్తి కొద్ది వారు నిర్వహించుకుంటారని, అందులో తప్పులేదని, అయితే ఈ సందర్భంగా ఆనాధలకి, పేదలకి అండగా, సహాయంగా ఉండేదుకు కొంత మొత్తాన్ని ఖర్చు చేసే విధంగా ప్రజలు ఆలోచనలు సాగించాలని, అది వారికి ఎంతో మంచి చేస్తుందని, సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కిట్టీ పార్టీలు మహిళలు ఎంతో ఉత్సాహంగా నెలనెలా నిర్వహించుకుంటారని, ఇటీవల నెల్లూరు నగరంలో కిట్టీ పార్టీల పేరుతో నెలనెల అనేక ప్రాంతాలలో మహిళలు కలుస్తున్నారని, వారు కూడా సంవత్సరానికి ఒక సారి ఒక కిట్టీ పార్టీకి అయ్యే ఖర్చులో కొంత భాగం అనాధాశ్రమాలకోసం ఖర్చుపెట్టి, అనాదలకు అండగా ఉండేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇది ఎంతో అభినందనీయమని అన్నారు. అనంతరం దవ్వూరు నగేష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు నగేష్ రెడ్డి, ఆరుగుంట ధనుంజయ్ రెడ్డి, వైసీపీ యస్.సి సెల్ అధ్యక్షుడు తూళ్ళూరు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY