e-ఆఫీస్ పై పోలీసు అధికారులకు రెండవ రోజు శిక్షణ

0
85

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా యస్.పి. భాస్కర్ భూషణ్, IPS., ఆదేశాల మేరకు ఐ.టి. కోర్ టీం ఆద్వర్యంలో NIC డిపార్ట్మెంట్ సిబ్బందిచే e-ఆఫీస్ పై పోలీసు అధికారులకు రెండవ రోజు శిక్షణ ఇవ్వడమైనది. నెల్లూరు టౌన్, గూడూరు, కావలి, ఆత్మకూరు, ట్రాఫిక్ మరియు యస్.బి. విభాగాల అధికారులకు నిర్వహించడం జరిగింది.
e-ఆఫీస్ వినియోగించడం ద్వారా కాగితం, సమయం, డబ్బు ఆదా చేయడంతో పాటు మెరుగైన ఉత్పాదకత, డేటా భద్రత, సమగ్రతకు హామీ, పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉంటుందని NIC శిక్షణా సిబ్బంది తెలిపారు. ఇ-ఫైల్ అప్లికేషన్ వాడకంలో నైపుణ్యం, లక్షణాల గురించి అవగాహన, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి చిట్కాలు మరియు సమస్యలు వస్తే పరిష్కరించుకోవడం కోసం మార్గాలు మరియు పోలీస్ డిపార్టుమెంటు లో లీవ్స్, మెమోలు, జనరల్ అర్జీలు, MCR వంటివి పై అధికారులకు పంపే విధానం, అధికారుల అందరిచే ప్రాక్టీస్ చేయించి, సందేహాలను నివృత్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు NIC శిక్షణా సిబ్బంది, నెల్లూరు టౌన్, గూడూరు, కావలి, ఆత్మకూరు, ట్రాఫిక్, ప్రొబేషనరీ డి.యస్.పి. యస్.బి., అన్ని విభాగాల CI లు, SI లు, ఐ.టి. కోర్ టీం ఇంచార్జ్ ASI వారి సిబ్బంది పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY