మేడే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

0
463

Times of Nellore ( Nellore ) – మేడే సందర్భంగా ప్రముఖ సింహపురి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రరెడ్డి దంపతులు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాట్ల నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా కార్మికులు సంబరాలు చేసుకునే రోజు “మేడే” అన్నారు. ఆనాడు 10 నుండి 14 గంటలు పనిచేస్తుండిన కార్మికులకు 8 గంటల పని చేసిన రోజే మేడే అన్నారు. కార్మిక లోకానికి శుభాకాంక్షులు తెలిపారు. ఎర్ర సూర్యుడుగా పేరుగాంచిన పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం కూడా ఈ రోజే అని, ఆయన్ని కూడా స్మరించుకుంటూ రవీంద్రరెడ్డి కుటుంబ సభ్యులు ఈ రోజు పేదలకు పండ్లు, పోషక పదార్ధాలు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. రాధాకృష్ణ రాజు, ఆర్.ఎమ్.ఓ. డా. వరప్రసాద్, సిఐటిఓ నాయకులు సంధాని తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY