త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా – ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
463

Times of Nellore ( Nellore ) – మన ఎమ్మెల్యే – మన ఇంటికి ప్రజాబాటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 67వ రోజు బుజబుజ నెల్లూరులో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్థానిక ప్రజలు త్రాగునీటి కోసం పడుతున్న కష్టాలను వివరించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, చాలా కాలంగా బుజబుజ నెల్లూరులో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అనేక సార్లు, అనేక ప్రయాత్నాలు నీటి సమస్య పరిష్కారం కోసం చేయడం జరిగిందన్నారు. కొన్ని సందర్భాలలో వాటర్ ట్యాంకర్ లు కూడా పంపించడం జరిగిదన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ బుజబుజ నెల్లూరు విలీన అయినప్పటికి కూడా ఇంకా రోజుకి దాదాపు 100కు పైగా వాటర్ ట్యాంకర్లు బుజబుజ నెల్లూరులో నీరు అందిస్తున్నారని, నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారంటే  ఈ ప్రాంతంలో నీటి సమస్య ఎంత ఉందో అధికారులు ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉందని అన్నారు. ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకుపోయినా పూర్తిస్థాయిలో ఫలితం రాలేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు బుజబుజ నెల్లూరు త్రాగునీటి సమస్యను ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కార మార్గాలు వెతకాలని కోరారు. బుజబుజ నెల్లూరులో త్రాగునీటి సమస్య కోసం ప్రత్యేక కృషి చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY