నెల్లూరు దొరతోపు కాలేనిలో ముగిసిన దసరా వేడుకలు!

0
158

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నెల్లూరులోని నవలాకుల గార్డెన్స్, దొరతోపు కాలనీ, 4వ మైలు శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం లో శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నిన్న(8-10-2019) రాత్రి అమ్మవారు విజయలక్ష్మి దేవి అలంకారం లో భక్తులకు కనువిందు చేశారు. ఉత్సవాలలో చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పొంగళ్ళు కార్యక్రమం నిర్వహించారు. రాత్రి అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయలక్ష్మి దేవి అలంకారమునకు పొగిడి అను, కల్లూరు సాయినిధి, అర్దమాల శివాని గార్లు ఉభయ దాతలుగా వ్యవహరించారు. కాగా ఈ కార్యక్రమమునకు కార్యనిర్వాహకులు గా చింతల భూపతిరాజు, వీర సురేంద్ర, వేమా మధుసూదనరావు, వేమా వైష్ణవి నాయకు, పెర్నాటి కావ్య నాయకు, వింజమూరు రవిత్రేని గార్లు వ్యవహరించారు. సింహపురి యూత్ మరియు గ్రామ ప్రజల సహాయ సహకారాల వలన వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఊరేగింపు కార్యక్రమంలో హిజ్రాలచే అమ్మవారి వేషధారణ, మేళతాళములతో, తప్పెట్లు, బాణాసంచాలతో, కోలాటంతో, డీజే, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది.

SHARE

LEAVE A REPLY