దివ్యంగులకు బాసటగా నిలుద్దాం – ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
81

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇద్దరు దివ్యాంగులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్రైసైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారంతో, స్వర్ణభారత్ ట్రస్ట్, జిల్లా పరిషత్, తన స్నేహితుల, దాతల సహాయ సహకారాలతో ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా వికలాంగ సోదరులకి టైసైకిళ్ళు, హ్యాండ్ స్టిక్ లు, వినికిడి యంత్రాలు మొదలగు పరికరములు అందించడం జరిగిందని అన్నారు. ఆపదలో ఉన్నవారికి, అనాధలకి మనం అండగా నిలిస్తే, ఆ భగవంతుడు మన కుటుంబాలకి అండగా నిలుస్తాడని, తనకు అత్యంత తృప్తి నిచ్చేది సామాజిక సేవా కార్యక్రమాలన్నారు. ఎక్కడైనా సరె రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసి, సమాజంలో మనసున్న దాతలను తాను ప్రత్యేకంగా కోరుతున్నది ఏమనగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడితే దానిలో ఉన్న తృప్తి దేనిలో ఉండదని, మన కుటుంబాలలో వివాహాలు, జన్మదినాలు మొదలగు శుభకార్యములు జరుగునప్పుడు అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటామని, దివ్యాంగుల కోసం అనాదల కోసం కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాలని కోరారు.

8వ తరగతి చదువుతున్న బాలిక స్నిగ్ధను అభినందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
వేదయపాళెంకు చెందిన స్నిగ్ధ అనే 8వ తరగతి చదువుతున్న బాలిక తన జన్మదిన వేడుకలకు అయ్యే ఖర్చును ఒక ట్రైసైకిల్ కు అందించడం తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు.

 

SHARE

LEAVE A REPLY