లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ

0
548

Times of Nellore ( Udayagiri ) – ఉదయగిరి నియోజకవర్గం, జలదంకి మండలం, బ్రహ్మణ క్రాక గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బుధవారం లయన్స్ క్లబ్ హైదరాబాదు వారు విద్యార్థులకు ఇంగ్లీషు డిక్షనరీలు, స్వామి వివేకానంద జీవిత సందేశం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ కార్యక్రమము నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, లయన్స్ క్లబ్, హైదరాబాదు వారు బ్రాహ్మణక్రాక గ్రామంలో ఉన్న హైస్కూల్ విధ్యార్థుల ప్రతిభాపాఠవాలను గుర్తించి, వారికి ఇంకా ఉపయోగకరంగా ఉండే పుస్తకాలను ఇవ్వటం ఆనందకరమైన విషయం అని తెలిపారు. అలాగే క్లబ్ వారికి అభినందనలు తెలియజేసి, వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో క్లబ్ ఫెసిలిటేటర్ లయన్ బి.చిరంజీవి రెడ్డి, ప్రెసిడెంట్ లయన్ పి.సుబ్బా రెడ్డి, సెక్రటరీ లయన్ వినోద్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ లయన్ అమర్నాథరెడ్డి, స్కూల్ సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY