ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ

0
170

Times of Nellore ( Nellore ) – తల్లిపాలు వారోత్సవాలు ముగింపు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషన్ ప్రగతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని మెటర్నిటి విభాగము నందు బాలింతలకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాట్ల నరసింహారావు, సీనియర్ వైద్యులు డా. మధుసూదన శాస్త్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుండి 7 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయని, పుట్టిన బిడ్డకు అరగంట 6నెలల వరకు తల్లిపాలు ఎంతో శ్రేయస్సుకరమని రోగనిరోదక శక్తి ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి అధ్యక్షులు ఆసిప్ బాషా, సెక్రటరి షానవాజ్, ట్రెజరర్ శ్యామ్, హరి, జమీర్, జాఫర్ లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ డా. రాధాకృష్ణరాజు, ఆర్ఎంఓ డా. వరప్రసాద్, అడ్మినిస్ట్రేటర్ డా. కళారాణి, సభ్యులు బి.వి లక్ష్మి పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY