మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

0
343

Times of Nellore ( Gudur ) – మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని సి.ఎస్.ఎం పాఠశాల, 7th వార్డ్ మునిసిపల్ పాఠశాల, ఉర్దూ బాయ్స్ మరియు గర్ల్స్ పాఠశాలలోని 250 పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిధులుగా వీచేసినటువంటి మునిసిపల్ ఛైర్పర్సన్ పోనక దేవసేన మాట్లాడుతూ.. మునిసిపల్ స్కూల్ లో చదివే ప్రతిఒక్కరు బాగా చదువుకోవడానికి మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించడం చాలా సంతోషం అని చిన్న వయసులోనే అనేక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలియజేశారు. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ గౌరవాద్యక్షులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ.. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు చేసే సేవ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధానఉపాధ్యాయులు పరంజ్యోతి మాట్లాడుతూ.. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగ కరంగా ఉంటాయని తమ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఎం. ఎఫ్. ఏ సబ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, సభ్యులు రాహుల్, కలీమ్, ప్రశాంత్, పవన్ సాయి కుమార్, శ్రీను, అజిజ్, రాక్షిత్, నవీన్, అంజద్, హరి, రాజు, సాయి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY