కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ

0
137

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ లో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, బిసి సెల్ రాష్ట్ర నాయకులు శివాచారి పాల్గొని విద్యార్ధులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నగర్ లో ఉన్న పాఠశాలలో ప్రభుత్వం కనీస వసతలు కూడా కల్పించకపోవడం బాధకరమని అన్నారు. అలాగే పాఠశాల భవనం కూడా సరిగ్గా లేదన్నారు. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు తల్లితండ్రులు విన్నవించడం జరిగిందని పేర్కొన్నారు. పాఠశాల భవన నిర్మాణానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతామని అన్నారు. పాఠశాల భవన నిర్మాణ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నగర్ లో ఉన్న ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.

SHARE

LEAVE A REPLY