మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

0
155

Times of Nellore ( Gudur ) – మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతలు సాయి, సుమన్, గోవింద్  సహకారంతో గూడూరు లోని కాంతారావు మరియు బొమ్మిరెడ్డి మునిసిపల్ పాఠశాలలో ని 140 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా విచ్చేసిన శ్రీధర్, అలీ మాట్లాడుతూ.. మునిసిపల్ స్కూల్ లో చదివే ప్రతిఒక్కరు బాగా చదువుకోవడానికి మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించడం చాలా సంతోషం అని తెలియజేశారు. ప్రధానఉపధ్యాయులు భగవాన్ మాట్లాడుతూ.. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగ కరంగా ఉంటాయని తమ పాఠశాలలో పుస్తకాలు పంచడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎం. ఎఫ్. ఏ సబ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, సభ్యులు రాహుల్, కలీమ్, మోహన్, అఙ్గార్, సాయి కుమార్, శ్రీను నవీన్, అమిన్, సందీప్, ఉదయ్, సాయి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY