శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయం లో ధ్వజావరోహణ కార్యక్రమం

0
85

Times of Nellore (Buchi) – బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నాడ గ్రామంలో వెలసియున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ధ్వజావరోహణ కార్యక్రమం జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అలకల తోపు కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతూ పూర్ణాహుతి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మహిళలకు కోడి ముద్దలను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఆలయ పాలకమండలి సభ్యులు సింగారెడ్డి లక్ష్మినర్సారెడ్డి, బాలా రవి, వేణు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY