అధికారుల నిర్వాకం.. ఆత్మహత్య చేసుకున్న దళితుడు

0
116

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అధికారుల నిర్వాకంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళితుడు తన ప్రాణాలను వదిలాడు. వివరాల్లోకెళితే.. చిట్టమూరు మండలం మెట్టులో 15 రోజుల క్రితం ఉడతా చిన్నయ్య అనే దళితుడి ఇల్లును పోలీసులు, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇల్లు తొలగించడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. దీంతో వారంతా 15 రోజులుగా బస్టాండులోనే తలదాచుకుంటున్నారు. కాగా, అధికారుల నిర్వాకంతో మనోవేధనకు గురైన చిన్నయ్య నేడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

SHARE

LEAVE A REPLY