జిల్లా కలెక్టరుపై కాకాణి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

0
158

Times of Nellore ( Nellore ) – జిల్లా కలెక్టరు ముత్యాలరాజుపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బి.సి. సంఘం నాయకులు సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం నెల్లూరు నగరంలోని బి.సి. సంఘం నాయకులు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి విఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన కులాల నుండి వచ్చిన జిల్లా అధికారిపై ఒక అగ్రవర్ణ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జిల్లా ప్రజల కోసం, జిల్లా అభివృద్ధి కోసం నిత్యం శ్రమించే కలెక్టరు పై వ్యాఖ్యలు సబబు కాదని, ఇకనైనా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.సి. సంఘ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY