విఎస్‌యుకి బస్సు సౌకర్యం కల్పించాలి

0
359

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరానికి 20 కి.మీ దూరం లో ఉన్న విక్రమ సింహపురి యూనివర్శి టీ వరకు ఆర్టీసి బస్సును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. యూనివర్శిటీ విద్యార్థులు ఎన్‌ మాదన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైస్‌ చాన్స్‌లర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్శిటీని కాకుటూరుకు తరలించి 2 సంవత్సరాలు అయిందన్నారు. నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, యూనివర్శిటీ సిబ్బంది, అద్యాపకులు పలు ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. కాకుటూరు నుండి యూనివర్శిటీకి రావాలంటే 1 కి.మీ దూరం ఉందని, రానున్నది వర్షాకాలం కాబట్టి అకస్మాతు ్తగా వర్షం వస్తే నిలిచేందుకు ఎటువంటి సౌకర్యంల లేదని, హైవే ప్రాంతంలో నిలిచేందుకు కనీసం ఒక షెడ్‌ అయినా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యపై స్పందించిన యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆర్టీసి అధికారులతో మాట్లాడి పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.

SHARE

LEAVE A REPLY