దళితుడు చనిపోతే కనీసం కొడుక్కి టికెట్ కూడా ఇవ్వరా?

0
26

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒శాసన మండలి రద్దు వ్యవహారంలో చైర్మన్ షరీఫ్ ని బండబూతులు తిట్టింది వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్. మండలి రద్దు కోసం డిమాండ్ చేసిన వైసీపీ నేతలు, బల్లి దుర్గా ప్రసాద్ కొడుక్కి ఎమ్మెల్సీ ఇస్తానని ఎలా హామీ ఇస్తారని అడిగారు. దళితుడు కాబట్టే.. ఆయన కొడుక్కి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని, జగన్ సామాజిక వర్గం నాయకుడు చనిపోతే.. వారి కొడుక్కి టికెట్ ఇవ్వకుండా ఉంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

SHARE

LEAVE A REPLY