నెల్లూరుజిల్లాకు తుఫాను హెచ్చరిక !!

0
4398
SONY DSC

Times of Nellore ( Nellore ) – బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం, తుఫానుగా మారింది. అది తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై, గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ నైరుతీ దిశగా పయనిస్తుంది. మరో 24 గంటల్లో అది కోస్తాంధ్రకు చేరువవుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ తుఫానుకు వాతావరణశాఖ కయాంత్ తుఫానుగా నామకరణం చేసింది. కోస్తాంధ్ర వైపు పయనిస్తున్న తుఫాను, గురువారం అర్ధరాత్రి గానీ, శుక్రవారం గానీ నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వైపు కోస్తాంధ్ర వైపు తరుముకొస్తున్న తుఫాను నేపద్యంలో వాతావరణశాఖ అప్రమత్తమయింది. అన్నీ ఓడ రేవుల్లో 2వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. గురువారం నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. మరోవైపు తుఫాను నేపద్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

SHARE

LEAVE A REPLY