కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ -2019

0
277

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #- కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా శనివారం నెల్లూరు ఏ సి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఎన్ సి సి సీనియర్ – జె ఎం సి సి జట్లు తలపడ్డాయి. ఎన్ సి సి సీనియర్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 35 .3 ఓవర్లలో 199 పరుగులకు అల్ అవుట్ అయింది. ఈ జట్టులోని సాయిచరణ్ రెడ్డి 97 బంతులతో 115 పరుగులు చేసి, ఈ లీగ్ లోనే మొదటి సెంచరీ నమోదు చేసాడు. 200 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన జె ఎం సి సి జట్టు 21 .4 ఓవర్లలో 121 పరుగులకు అల్ అవుట్ అయింది. ఎన్ సి సి సీనియర్ జట్టు లోని బాలాజీ -5 ,తౌసీఫ్ -3 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి దోహదపడ్డారు. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా పుల్లయ్య, రమేష్, స్కోరర్ గా అల్లాబక్షు వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY