నెల్లూరు కోవిడ్ ఆసుపత్రిలో సేవా లోపాలు ఏర్పడితే సహించేది లేదు – మంత్రి అనిల్

0
101

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు కోవిడ్ ఆసుపత్రిలో సేవా లోపాలు ఏర్పడితే సహించేది లేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ విజయవాడ నుంచి జిల్లా ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో పని చేస్తుంటే కొంత మంది ఆధికారులు మరింతగా ఎందుకు కష్ట పడలేక పోతున్నారని ఓ దశలో ఆయన ప్రశ్నించాల్సిన పరిస్థితిని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వినోద్ కుమార్ జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY