స్వచ్ఛంద్రప్రదేశ్ లో అవినీతి జరిగింది – ఎమ్మెల్యే కాకాణి

0
250

Times of Nellore ( Nellore ) – స్వచ్ఛంద్రప్రదేశ్ లో సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి జరిగిందని, మరుగుదోడ్ల నిర్మాణాలలో మంత్రి సోమిరెడ్డి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్న వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లక్షల రూపాయలు ప్రజలధనం దుర్వినియోగం అవుతుందని, వాటికి సంబంధించిన దాంట్లో సోమిరెడ్డిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద్రప్రదేశ్ అవార్డు వచ్చిందని అని చెబుతున్నారని, వచ్చినటువంటి అవార్డు వెనుక అవినీతి జరిగిందని చెబితే, ప్రజలు అన్యాయం జరుగుతుందని, దానికి సంబంధించి ప్రశ్నిస్తే, దానికి మాకు సంబంధం లేదని సమాదానాలు ఇస్తున్నారని అన్నారు. స్వచ్ఛంద్రప్రదేశ్ అనేది మన జిల్లాలో సరిగా అమలు కాలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి మందల వెంకటశేసయ్య, జెడ్.పి.టి.సి నెల్లూరు శివప్రసాద్, జెడ్.పి.టి.సి పొట్టేళ్ల శిరీష , జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ దాసరి భాస్కర్ గౌడ్, తిరుపతి పార్లమెంట్ బి.సి.సెల్ అద్యక్షులు, రాగాల వెంకటేశ్వర్లు, ఆనంద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY