చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో అవినీతి – మిడతల రమేష్

0
212

Times of Nellore ( Nellore ) – ప్రధాని మోడీ పై బీజేపీ పై సిఎం చంద్రబాబు, టిడిపి నాయకులు చేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా బీజేపీ నాయకలు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి పాలనను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై బురద చల్లుతున్నారని, చంద్రబాబు అవినీతి ప్రజలకు తెలిసిపోయిందని, టిడిపి ప్రభుత్వానికి పతనం తప్పుదని బీజేపీ నేత మిడతల రమేష్ హెచ్చరించారు. టిడిపి నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అవినీతిమయమై ఉన్నాయని, అవినీతిలో మునిగి ఉన్న చంద్రబాబుకు మోడీని విమర్శించే హక్కు లేదని అన్నారు. రాష్ట్రంలో హత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, టిడిపి ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించలేకపోయిందని, లా అండ్ ఆర్డర్ విఫలమైందని, చంద్రబాబు పాలించే అర్హత కోల్పయాడని మండిపడ్డారు.

SHARE

LEAVE A REPLY