చిరంజీవి అభిమానుల సేవలు హర్షణీయం!

0
103

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి అభిమానులు చేస్తున్న సేవకార్యక్రమలు హర్షణీయమని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్. రవిశంకర్ అన్నారు…చిరంజీవి 64 వ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం బాలజీ నగర్ లోని నలంద విద్యా సంస్థలలో నెల్లూరు చిరంజీవి యువత ఆధ్వర్యంలో మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులకు, అభిమానులకు 1000 మొక్కలు పంపినిచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ చిరంజీవిగారి అభిమానులు రక్తదాన శిబిరాలను నిర్వహించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం అందరికి ఆదర్శనీయమన్నారు.అనంతరం యువత జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. మునుముందు చిరంజీవి యువత ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో రవికుమార్, వేణు,కిషోర్, శేషయ్య, సాయి, రవి, హనుమంతరావు, రవిశంకర్ రమేష్, మహేంద్ర, చరణ్, జగన్లు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY