“చేగువేరా ఫౌండేషన్” సేవలు స్ఫూర్తిదాయకం…

0
496

Times of Nellore ( Gudur ) – గూడూరు పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి చేగువేరా ఫౌండేషన్ నిర్వాహకులు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద మహిళలకు కుట్టు మిషన్లు , ఇంటర్ డిగ్రీ చదివే మెరిట్ విద్యార్థినీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పౌండేషన్ నిర్వాహకుడు సురేష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు . ప్రతి ఒక్కరు తమకున్నంతలో లేనివారికి సాయం చేసే గుణం అలవర్చుకోవాలన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చేగువేరా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని కొనియాడారు. పౌండేషన్ కు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన వెల్లడించారు . పౌండేషన్ నిర్వాహకుడు సురేష్ మాట్లాడుతూ.. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించారని అన్నారు. కోట అసోసియేట్స్ అధినేత కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ.. చేగువేరా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం అవుతానని ప్రకటించారు. ఫౌండేషన్ ద్వారా అన్ని రంగాల్లో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ చైర్మన్ ఆదినారాయణ రెడ్డి, గ్రూప్ థియేటర్ల యజమాని చదలవాడ హరిబాబు , కౌన్సిలర్లు నాగులు, గిరి, శ్రీనివాసులు, చంద్ర నిల్, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY