పోతున్న ప్రాణాలను నిలిపారు … !

0
822

Times of Nellore (Nellore) – కోట సునీల్ కుమార్: నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న సాంబశివరావు అనేవ్యక్తి ఆదివారం రాత్రి రైలు ఢీకొన్న ప్రమాదంలో రెండుకాళ్ళు పూర్తిగా దెబ్బతినగా రక్తపుమడుగులో అక్కడే స్పృహ కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన సాంబశివరావు ను అర్ధరాత్రి ప్రభుత్వ హాస్పిటల్ కు చేర్చారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన వైద్యులు, అనస్తీషియా వైద్యుల సహకారంతో వివిధ పరీక్షలు నిర్వహించి, పూర్తిగా దెబ్బతిన్న రెండు కాళ్ళు తొలగించి అతని ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ విజయమంతమై సాంబశివరావు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి , నేడు స్పృహలోకొచ్చాడు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు సాంబశివరావు ను పరామర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. కార్పొరేట్ హిస్పిటల్స్ కి ధీటుగా క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి బాధితుడి ప్రాణాలను నిలిపిన వైద్య బృందానికి, నర్సులకు, ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచామని, డాక్టర్ల, నర్సుల సంఖ్య ను కూడా పెంచడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సూపరింటెండెంట్ డా. రాధాకృష్ణరాజు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY