సర్జికల్ వార్డ్ ను సందర్శించిన చాట్ల నరసింహారావు

0
75

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగుల అటెండర్ల కు ఉచిత అన్న దానం చేస్తున్న శ్రీ సత్యసాయి అక్షయ సేవా ట్రస్ట్ త్రీ వ వార్షికోత్సవం సందర్బంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు సర్గిక వార్డ్ ను సందర్శించారు. 2016 జనవరి 3 న ప్రారంభించిన నిత్యా అన్నదాన కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుంది. ఈ సందర్బంగా చాట్ల నరసింహారావు మాట్లాడారు. నిత్యం 400 మందికి పైగా ఇన్ పేషేంట్ లు ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వం రోగులకు మాత్రమే ఉచిత బహుజన సదుపాయం కల్పిస్తుందని, రోగుల అటెండర్లు బయట తినాలని అన్నారు. ఈ సత్యసాయి ట్రస్ట్ వారు అలాంటివారికి రోజుకు ౨౦౦ మందికి పైగా అన్నదానం చేస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగించాలని కోరారు. సత్యసాయి ట్రస్ట్ వారిని ఈ సందర్భాన అయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.శ్రీనివాసరావు,ఆర్ ఎం ఓ డా.వరప్రసాద్,నిర్వాహకులు డా.సురేష్,శ్రీమతి రాజేశ్వరమ్మ,ఆనంద్ కృష్ణ పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY