ప్రభ్వుత్వ వైద్యశాలలో సదరన్ క్యాంపు ను పరిశీలించిన చాట్ల

0
273

Times of Nellore ( Nellore ) – ప్రతి శుక్రవారం నెల్లూరు ప్రభ్వుత్వ వైద్యశాలలో వికలాంగులకు పరీక్షలు చేసి, సర్టిఫికేట్లు జారీ చేసే సదరన్ క్యాంపు ను అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని మీ సేవ కి వెళ్లితే పరీక్షలు తేది ఇస్తారని, దాని ప్రకారం ప్రతి శుక్రవారం పరీక్షల తేది ఇస్తారని అన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. మరుసటి రోజే మీ సేవా లో సర్టిఫికేట్లు పొందవచ్చునని పేర్కొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా సర్టిఫికేటు పొంది వికలాంగుల పెన్షన్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. రాధకృష్ణ రాజు, ఆర్.ఎం.ఓ డా. వరప్రసాద్, డా. మస్తాన్ బాషా, కార్పొరేటర్ రాజానాయుడు, సభ్యులు బి.వి లక్ష్మీ, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY