మెటర్నిటీ విభాగాన్ని తనిఖీ చేసిన చాట్ల నరసింహారావు

0
151

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ లోని మెటర్నిటీ విభాగంలో గల గర్భవతులు, చిన్న పిల్లల విభాగాలను సోమవారం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాట్ల నరసింహారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లల విభాగంలో 16 మంది డాక్టర్లు ఉండవలసి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారని, గైనకాలజిస్టులు 16 మంది ఉండవలసి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారన్నారు. ప్రతి నెల 9వ తేది న జరుగు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వయోగ పధకము ద్వారా 3 నెలల నుండి 6 నెలల గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిర్వహించబడు వైద్యసేవల క్యాంపు ను పరిశీలించారు. అలాగే స్కానింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. రాధాకృష్ణరాజు, గైనకాలజిస్టు డా. సుమతి, డా. లక్ష్మీనారాయణ, సభ్యురాలు బి.వి.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY