జయలలిత నగర్ లోని పేదలకు మాస్క్లు పండ్లు పంపిణి

0
100

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-నెల్లూరు నగరములోని,49వ డివిజన్,స్ధానిక పాత మునిసిపల్ కార్యాలయ సమీపములోని,జయలలిత నగర్ నందు నివసించే పేద ప్రజలకు ఇందుకూరుపేట మండలం, రాహిత్య ఐ.టి.ఐ,నగరములోని,బి.వి.నగర్ నందుగల చెరిత్ ఐ.టి.ఐ.కళాశాల ఆధ్వర్యములో కరోనా సేవలను అందించారు. ఈ సందర్భంగా స్ధానికంగా ఉండే పేదలకు పండ్లు,మాస్కులు పంపిణీ చేశారు. అలాగే కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సత్యనారాయణ,సుబ్బలక్ష్మి మాట్లాడుతూ నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలను వేగం చేస్తున్నారని, తాము కూడా తమ సంస్ధ ఆధ్వర్యములో నేడు పేద ప్రజలు నివశించే జయలలిత నగర్ వాసులకు మాస్కులు,పండ్లు పంపిణీ చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖానికి మాస్కులు తప్పక ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమములో కన్వీనర్ చరిత్, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ బాబు,కె.సూర్యనారాయణ,ట్రెజరర్ సి.సి.కొండయ్య, సిబ్బంది విజయ సుందరం,సిబ్బంది శ్రీకాంత్, వాలంటరీలు,సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY