క‌రోనా వ్యాధి గ్ర‌స్థులకు వ‌రం – అపోలో హాస్పిట‌ల్స్‌లో పోస్ట్ క‌రోనా నియంత్ర‌ణ విభాగం!!

0
93

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒క‌రోనా వ్య‌ధి గ్ర‌స్థుల‌కు అపోలో హాస్పిట‌ల్స్ త‌మ‌దైన శైలిలో సేవ‌లు అందించేందుకు ముందుకు వ‌చ్చింది. క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయిన త‌రువాత‌, మ‌ళ్లీ ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, దాని తీవ్రత‌ కూడా అధికంగా ఉంటుంది. దీనినే పోస్ట్ క‌రోనా అంటారు. ఈ పోస్ట్ క‌రోనాతో బాధ‌ప‌డేవారి కోసం అపోలో హాస్పిట‌ల్స్ స‌రికొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. పోస్ట్ క‌రోనా నియంత్ర‌ణ విభాగాన్ని 19వ తేది నుంచి దేశ‌వ్యాప్తంగా ఉన్న అపోలో గ్రూప్స్ హాస్పిట‌ళ్ల‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. క‌రోనా వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డిన వారిలో 50 శాతం మంది, తాత్క‌లిక‌, దీర్ఘ‌కాలికంగా శ్వాస స‌రిగా తీసుకోలేక‌పోవ‌డం, హృద్రోగ స‌మ‌స్య‌లు, కీళ్ల నొప్పులు, కంటి చూపు స‌మ‌స్య‌లు, వంటి ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అపోలో హాస్పిట‌ల్స్ ప్ర‌త్యేక‌మైన వైద్య‌బృందంతో, నిపుణులైన న్యూరాలజీ, ఇమ్యూనాల‌జీ వైద్యుల‌తో ఈ పోస్ట్ క‌రోనా కంట్రోల్ సెంట‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. పోస్ట్ క‌రోనా కార‌ణంగా వివిధ ఆరోగ్య స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి అత్యాధునిక వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్.

ఈ సంద‌ర్భంగా నెల్లూరులోని అపోలో హాస్పిట‌ల్‌లో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్ట‌ర్ శ్రీరాం సతీశ్ మాట్లాడుతూ త‌మ హాస్పిట‌ల్‌లో క‌రోనా వ్యాధి నుంచి కోలుకున్న అనేక మంది రోగులు, తిరిగి వివిధ అనారోగ్య‌ స‌మ‌స్య‌లు, క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో మ‌మ‌ల్ని సంప్ర‌దిస్తున్నార‌ని, ఈ త‌రుణంలో క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డిన త‌రువాత రోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకే ఈ పోస్ట్ క‌రోనా రిక‌వ‌రీ క్లీనిక్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిట‌ల్స్‌లో ప్రారంభించిన ఈ పోస్ట్ క‌రోనా నియంత్ర‌ణ విభాగం ద్వారా రోగుల‌కు విలువైన వైద్య‌సేవ‌లు అందించ‌డంతో పాటూ , ప్ర‌త్యేక సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను చేడ‌ప‌తున్నామ‌ని అన్నారు. సుక్షితులైన వైద్యులు ఈ విభాగంలో ఉన్నార‌ని, వీరు అనుక్ష‌ణం రోగులు ఆరోగ్యానికి సంబంధించిన త‌గిన మార్గ‌ ‌ద‌ర్శ‌కాలు ఇస్తూ, క‌రోనాకు ముందు వారు ఏవిధంగా అయితే జీవించారో అదేవిధంగా త‌మ జీవ‌నాన్ని సాగించేందుకు అపోలో పోస్ట్ క‌రోనా నియంత్ర‌ణ విభాగం ఎంతో స‌హాయ‌ప‌డుతుంద‌ని అన్నారు. పోస్ట్ క‌రోనా వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా గుండె నొప్పితోపాటూ ప‌లు తీవ్రమైన సంఘ‌ట‌న‌లు ఉంటాయ‌ని, బిపి, ర‌క్త‌పోటు వంటి స‌మ‌స్య‌ల తీవ్రత అధికంగా ఉంటుంద‌ని అన్నారు. క‌రోనా నుంచి రిక‌వ‌రీ అయిన త‌రువాత పోస్ట్ క‌రోన వ‌చ్చిన వారిలో అధికశాతం మంది మృతి చెందార‌ని, వీరిలో అధికంగా గుండె నొప్పి రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చ‌న్నారు

అదేవిధంగా అపోలో హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు దినేశ్ రెడ్డి ,డాక్టరు యం.సి.యస్ రెడ్డి ,డాక్టరు ఉమామహేశ్,డాక్టరు అనిత లు మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ ఊపిరితిత్తుల‌పైనే కాకుండా, శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌పై దాడి చేసుంద‌ని, దీని వ‌ల్ల దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌న్నారు. క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారిలో తిరిగి ఆ ల‌క్ష‌ణాలు వ‌స్తే, శ‌రీరంపై దాని ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌ని అన్నారు. ఇలా హాస్పిట‌ల్‌లో చేరిన వారిలో దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు క‌నిపిస్తుండ‌టం ఆందోళ‌న క‌లిస్తుంద‌ని అన్నారు. క‌రోనా త‌గ్గి ఆ వ్యాధి తిర‌గ‌బెట్టిన‌ప్పుడు వారిని ప‌ర్య‌వేక్షించేందుకే అపోలో హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో ఈ పోస్ట్ క‌రోనా నియంత్రణ విభాగాన్ని ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు

అపోలో హాస్పిట‌ల్ యూనిట్ హెడ్ నవీన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్ర‌జ‌లంతా 70శాతం మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన పోస్ట్ క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్ర‌త్యేక దృష్టి సారించి, ప‌రిష్కారా మార్గాలు చూపించ‌లేక‌పోతే, క‌రోనాను మించిన మ‌హ‌మ్మారిగా ఈ పోస్ట్ క‌రోనా విజృంభించి, మ‌ర‌ణాల రేటు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ తీవ్ర‌త మ‌రింత అబివృద్ధి చెంద‌కుండా, హానిక‌రంగా మార‌కుండా ఉండేందుకు ఈ పోస్ట్ క‌రోనా నియంత్ర‌ణ కేంద్రాలు ఎంతో దోహ‌ద ప‌డుతాయ‌న్నారు. ఈ విభాగం ద్వారా టెలిక‌న్స‌ల్టెన్సీ, నేరుగా క్లినిక్ సేవ‌లు అందించే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి, ఈ పోస్ట్ కోవిడ్ సిండ్ర‌మ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధ‌మైనట్లు వెల్ల‌డించారు. తొలుత ఈ పోస్ట్ కోవిడ్ రిక‌వ‌రీ విభాగాల‌ను చెన్నై, మ‌ధురై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, మైసూరు , కోల్‌క‌త్తా, భువ‌నేశ్వ‌ర్‌, గోహ‌తి, ఢిల్లీ, ఇండోర్‌, ల‌క్నో, ముంబై, అహ్మాదాబాద్‌ల‌లోని కోవిడ్‌కు చికిత్స‌లు అందించే అపోలో హాస్పిట‌ల్స్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విభాగాలను ఒక న‌ర్సు స‌హాయంతో సుశిక్షితులైన వైద్యుల బృందం నిర్వ‌హిస్తుంద‌ని, మ‌రిన్ని వివ‌రాల కోసం అపోలో హాస్పటల్ను సంద‌ర్శించాల‌ని, లేదా 0861-3337333, 0861-6667333 నెంబ‌ర్‌లకు కాల్ చేయాల‌ని సూచించారు.

SHARE

LEAVE A REPLY