ఏపీలో కరోనా బాధితుల ఆక్రందన

0
70

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లకు బాధితులు, అనుమానితుల తాకిడి పెరుగుతోంది. అయినా అక్కడి పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ సెంటర్ అయితే.. కాలాపానీ జైలును తలపిస్తోంది. మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నదీలేదు. ఒంట్లో బాగోలేదని చెబుతున్నా మూడు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. రోగులను తరలించే స్ట్రెచర్‌లపైనే భోజనం పెడుతున్నారు.

కోవిడ్ సెంటర్లలోని బాధితులకు అన్నం, సాంబారు, కూర, పెరుగు.. అన్ని చిన్న చిన్న కవర్లలో పెట్టి ఇస్తున్నారు. అంతంతమాత్రం రుచి, నాణ్యత. ఈ ఆహారం తినలేక బయటనుంచి తెప్పించుకోవాలంటే అక్కడున్న సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన స్టేట్ కోవిడ్ సెంటర్‌లో ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల నుంచి కూడా కరోనా రోగులను తీసుకువస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో కరోనా బాధితుడికి ఆహారం కోసం మొన్నటి వరకు రూ.

340 కేటాయిస్తుంది. కానీ రూ. 30, 40 విలువ చేసే భోజనం కూడా అందివ్వడంలేదు. కానీ ఒక్కో కరోనా బాధితుడికి రూ. 5 వందలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

SHARE

LEAVE A REPLY