బుచ్చిరెడ్డిపాలెం సీఐ సుబ్బారావు సస్పెండ్..

0
2795

Times of Nellore ( Buchireddypalem ) – నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీఐ సుబ్బారావును సస్పెండ్ చేశారు. సుబ్బారావుపై అవినీతి, అక్రమాలు ఆరోపణలు రావడంతో ఎస్పీ పి.హెచ్.డి రామకృష్ణ, గూంటూరు రేంజ్ డీఐజీకి నివేదిక పంపారు. ఆ నివేదిక ప్రకారం డీఐజీ.. సుబ్బారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఫిర్యాదుదారులు ఏవైన కేసుల నమోదు చేసేందుకు వచ్చిన వారిపై పెట్టే సెక్షన్ల విషయంలో చేసే వ్యవహారం పద్దతి బాగా లేదని, రైస్ మిల్ల్ నిర్వహకులు, ఇతర వ్యాపారస్తులను బెదిరించి వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాలు తీసుకుంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని, పోలీస్ వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవరిస్తున్నాడనే ఆరోపణలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. ఎస్పీ విచారణ చేసి అవి నిజమని తేలడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని డీఐజీకి నివేదిక పంపించడం జరిగింది. నివేదకను పరిశీలించిన, అక్రమాలకు పాల్పడుతున్న సీఐ సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

SHARE

LEAVE A REPLY