తండ్రి, కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు – సురేష్ రెడ్డి

0
203

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #- గుంటూరు లో నరేంద్ర మోడీ సభను అడ్డుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించినా సభ విజయవంతంగా జరిగిందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు బీజేపీ కార్యాలయం లో అయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ లో అనైతిక పరిపాలన సాగుతుందన్నారు. చంద్రబాబు ,లోకేష్ కలసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. మోడీ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనాన్ని నిధులు ఏపీ కి ఇచ్చారని, అటువంటి మోడీని గోబ్యాక్ అనడం చంద్రబాబు దగుల్బాజీ తనమన్నారు. రాష్ట్రము లో ఏ అవినీతి జరిగిన అందులో లోకేష్ కు వాటా ఉందన్నారు. మోడీ దేశాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళరై చంద్రబాబు అంటున్నారని, ప్రపంచదేశాలు మోడీ ని ప్రశంసిస్తున్నాయన్నారు. రేపు విశాఖలో జరిగే సభను దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు కు ఏపీ ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబుకి మోడీ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు.

SHARE

LEAVE A REPLY