నెల్లూరు లో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి – ఆంజనేయరెడ్డి

0
163

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ # – నెల్లూరు లో మంచినీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరామని బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. నగరం లోని బీజేపీ కార్యాలయంలో అయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి లకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ముఖ్యమంత్రి వై స్ జగన్ పారదర్శక పాలన అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. యువముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా అనుభవజ్ఞుడైన మాజీ ఎం,ముఖ్యమంత్రి చంద్రబాబు ను గమనం లోకి తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియా పై కఠినంగా వ్యవహరించి అణచి వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు సాధించుకోవాలన్నారు. న్యాయమైన సమస్యలు ఎమ్మెల్యే లతో సంబంధం లేకుండా పరిష్కరించాలని కోరారు. ప్రజల అసలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పని చేయాలనీ అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

SHARE

LEAVE A REPLY