నెల్లూరులో మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్ !!

0
1288

Times of Nellore ( Nellore ) – నెల్లూరునగరంలో పలు చోట్ల మోటర్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరు 1వ నగర పోలీసులు అరెస్టు చేశారు. వివారాల్లో కెళ్తే… నగరంలోని ఇరుగాళమ్మ సంఘం, పొర్లుకట్ట ప్రాంతాలకు చెందిన బెల్లాపల్లి రాజేష్, షేక్ ఖాజాలు చెడు వ్యసనాలకు బానిసలయ్యి చోరీలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో నగరంలోని వివిధ చోట్ల నాలుగు మోటార్ బైక్ లను దొంగిలించారు. వీటిపై 1వ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  సి.ఐ. అబ్ధుల్ కరీం, ఎస్సై జిలానీ బాషా విచారణ జరిపి ఇద్దరు దొంగలను చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుండి
ఒక లక్షా 85వేలు విలువ చేసే నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నగర డిఎస్పీ వెంకటరాముడు విలేకరుల సమావేశం నిర్వహించి, కేసు వివరాలను వెల్లడించారు. అనతి కాలంలోనే కేసును చేధించిన సిఐ, ఎస్సైతో పాటూ హెడ్ కానిస్టేబుళ్లు రఫి, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు దేవకిరణ్, వేణు, సురేష్, రమేష్, రామారావులను అభినందించి రివార్డులను అందజేశారు.

SHARE

LEAVE A REPLY