SP బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలి!!

0
41

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-ప్రముఖ గాయకుడు పద్మభూషణ్ SP బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలని ఎపియుడబ్లూజె రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .మంగళవారం నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ (సామ్నా) నిర్వహించిన అశ్రునివాళి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరూ కూడా పదహారు భాషల్లో నలభై వేల పాటలు పాడలేదని ఆయనను కొనియాడారు .పాటలతో పాటు తెలుగు భాషకు కూడా అతను చేసిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు .సంగీత కళాశాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వి గ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు .ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి అర్పించారు .ఈ కార్యక్రమంలో సామ్నా అధ్యక్షులు సర్వేపల్లి రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి జి హనోకు, ఉపాధ్యక్షులు సుబ్బారావు, సీనియర్ జర్నలిస్టులు బుజ్జి రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి అక్మల్ తదితరలు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY