బీసీలను ఓటు బ్యాంకు గానే అగ్రకుల పార్టీలు వాడుకుంటున్నారు -కేశన శంకర్ రావు !!

0
41

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒  మండల కమిషన్ నివేదిక ప్రకారం దేశ జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీలను ఓటు బ్యాంకు గానే అగ్రకుల పార్టీలు వాడుకుంటున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కేశన శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని యష్ పార్క్ హోటల్ లో బీసీ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై పలువురు నాయకులతో చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాల్సి ఉండగా కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో విరుద్ధంగా రిజర్వేషన్ కల్పించడం అన్యాయమన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల బడ్జెట్ లో సగం నిధిని బీసీల సంక్షేమానికి వినియోగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు.

SHARE

LEAVE A REPLY