బాషా పండితుల ప్రమోషన్లలో సెకండరీ గ్రేడుఉపాధ్యాయుల కు అవకాశం కల్పించాలి – బీసీఈఎఫ్ డిమాండ్

0
171

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ # – నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ ను బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ వారు కలసి బాషా పండితులు పదోన్నుతులలో ఎస్జీటీలకు అవకాశం కల్పించాలని  వినతిపత్రం అందజేశారు. బాషా పండితులు పదోన్నుతులలో అర్హతలు గల సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు యం.ఎ. తెలుగు వారికి అవకాశం కల్పించి సీనియార్టీ లిస్టులో పొందుపరుచుటకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం లో బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, జిల్లా అధ్యక్షులు తుమ్మ రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నం శ్రీనివాసులు, కోశాధికారి జీ.వి.రత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తల చంద్రశేఖర్, జి.దేవరాజ్, సుధాకర్ తదితరులు పాల్గోన్నారు.

SHARE

LEAVE A REPLY